సీఎఫ్ఎంఎస్ విధానంపై విచారణ జరిగితే సీఎం జగన్ జైలుకెళ్లాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత దేవినేని ఉమా. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన సోమ్మును ప్రభుత్వ పెద్దలు మింగేశారని ఆయన ఆరోపించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (Ys jagan) మండిపడ్డారు టీడీపీ (tdp) సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ (devineni uma) . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం (polavaram project) నిర్వాసితులకు అందించాల్సిన సొమ్మును ప్రభుత్వ పెద్దలు మింగేశారని దేవినేని ఆరోపించారు. దీనికి కారణమైన జగన్ జైలుకెళ్లడం ఖాయమని.. ఇందులో పోలవరం, రంపచోడవరం ఎమ్మెల్యేలతో పాటు జైల్లో వున్న ఎమ్మెల్సీ అనంతబాబు హస్తం వుందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి ఏపీ సిద్ధంగా వుందంటూ తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ (kcr) చేసిన ప్రకటనను జగన్ ఎందుకు ఖండించలేదని దేవినేని ఉమా ప్రశ్నించారు. కేసీఆర్ నుంచి ఎన్నికలకు నిధులు తెచ్చుకోవడం వల్లే జగన్ నోరుమెదపలేదని ఆయన ఆరోపించారు. 

Also Read:కాఫర్ డ్యాం నిర్మించకుండా పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం చారిత్రక తప్పిదం: చంద్రబాబుపై అంబటి పైర్

సీఎఫ్ఎంఎస్ (cfms) నుంచి ఆన్‌లైన్ పేమెంట్లు జరుగుతున్నాయని దేవినేని మండిపడ్డారు. ఈ విధానంపై విచారణ జరిగితే జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. లక్ష కోట్లకు బిల్లులు చెల్లిస్తే అందులో సజ్జల గిల్లుడు రూ.20 వేల కోట్లని దేవినేని ఉమా ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్ విధానాన్ని జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆయన మండిపడ్డారు. కాగ్ అడుగుతున్న ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఉమా నిలదీశారు. 

ఇకపోతే.. కాఫర్ డ్యాం నిర్మించకుండానే డయాఫ్రంవాల్ నిర్మించడాన్ని TDP నేతలు ఎలా సమర్ధించుకుంటారని మంత్రి అంబటి రాంబాబు ఇటీవల ఫైరయ్యారు. ఈ విషయమై Chandrababu, Devineni Uma Maheswara Raoతో చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మాణంపై మేథావులు, ఇంజనీర్లు, మీడియాలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసేసి నీళ్లు ఇస్తానన్న చంద్రబాబు, దేవినేని ఉమాలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారనని ప్రశ్నించారు. టీడీపీ సర్కార్ తెలివితక్కువ పని వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు.