అమరావతి:వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో  చంద్రబాబు సర్కార్  చేసిన పనులపై వేసిన  విచారణ కమిటీలు ఏమయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు.

గురువారం నాడు  దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు.  పాలన చేతకాక  జగన్ ఏదేదో చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.  పోలవరం ప్రాజెక్టు అంచనాలను కేంద్రం ఎలా ఆమోదం తెలిపిందని   ఆయన ప్రశ్నించారు.

సబ్ కమిటీలతో వైఎస్ జగన్  ఏం చేస్తారో చేయనివ్వాలని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న వైఎస్ జగన్.... ఏపీ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుండి  రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత జగన్ ఏమీ మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. సీఎం ఎన్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చట్టబద్దంగానే జరిగాయని దేవినేని గుర్తు చేశారు.