విజయవాడ: రాజధాని తరలింపు పేరుతో అధికార పార్టీ నాయకులు విశాఖలో భూఅక్రమాలకు పాల్పడుతున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఇక గుడివాడ ప్రాంతంలో బూతుల మంత్రి భూకబ్జాలు ఎక్కువయ్యాయన్నారు. ఈ భూముల ధరలు పెంచడానికే ఇప్పుడు ప్రభుత్వం భూముల అమ్మకాలు చేపట్టారని దేవినేని ఉమ ఆరోపించారు. 
 
''అధికార మదంతో సామాన్యులని బెదిరించి గుడివాడలో భూములు లాక్కొంటున్నారు  ప్రజలు ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదు. కరోనా సమయాల్లో కూడా మట్టి,పేకాట, ఇసుక,లిక్కర్ మాఫియా లు చెలరేగిపోతున్నాయి. బూతులు తిట్టే మంత్రిని కట్టడిచేసి చర్యలు తీసుకునే దైర్యం మీకు ఉందా వైఎస్ జగన్ గారు'' అని ప్రశ్నించారు. 
 
''విశాఖలో మీరు దోచుకున్న వేలాదిఎకరాల భూములకు రేట్లురావడం కోసం సంపదసృష్టి చేతకాక ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములని అమ్మేఅధికారం మీకు ఎవరుఇచ్చారు కోట్లుపెట్టి తెచ్చుకున్న మీ సలహాదారుల సలహాలు ఇవేనా?ఇది"బిల్డ్ ఏపీ"నా లేక "సెల్ ఏపీ"నా అని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు'' అని నిలదీశారు. 
 
''మొన్న ధాన్యం వ్యవసాయపంటలు నిన్న ఆక్వా  నేడు ఉద్యానపంటల రైతుల కన్నీరు కష్టాలు ప్రభుత్వానికి కనిపించడంలేదా. కోర్టు మొట్టికాయలు వేస్తున్నా కూడా మీ 3000కోట్ల దరల స్థిరీకరణ నిధితో మద్దతుధరకి ఎంత పంటకొనుగోలు చేశారని రైతులు అడుగుతున్నారు సమాధానంచెప్పండి ఒక్కఛాన్స్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ గారు'' అని ప్రశ్నించారు. 
  
''కరోనా కట్టడిచర్యలలో కూడా అవినీతా క్వారంటెన్ వసతుల్లో భోజన సదుపాయాలలో మీ నాయకుల చేతివాటం..బ్లీచింగ్ పౌడరులో సున్నమా? టెండర్లులేకుండా కోట్లరూపాయల కుంభకోణంచేసిన ఫ్యాక్టరీ ఎవరిది? వీటిపై ఏంచర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు సమాధానంచెప్పండి తాడేపల్లి రాజప్రసాదంలోని ముఖ్యమంత్రి వైఎస్  జగన్ గారు'' అని ముఖ్యమంత్రి జగన్ ను నిలదీశారు దేవినేని ఉమ.