మహానాయకుడు సినిమాలో లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహానాయకుడు సినిమాలో బాల్యంలో ఎన్టీఆర్ పాత్రలో దేవాన్ష్ నటించారు

హైదరాబాద్: మహానాయకుడు సినిమాలో లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహానాయకుడు సినిమాలో బాల్యంలో ఎన్టీఆర్ పాత్రలో దేవాన్ష్ నటించారు.

ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా తీశారు.ఎన్టీఆర్ ఉద్యోగాన్ని మానేసి సినీ రంగంలోకి అడుగుపెట్టి నెంబర్ వన్‌గా ఎదిగి రాజకీయాల్లోకి రావడాన్ని కథానాయకుడుగా, రాజకీయాల్లో చేరి ముఖ్యమంత్రిగా ప్రమయాణం చేయడం వంటి చరిత్రతో మహానాయకుడుగా విడుదల చేశారు.

కథానాయకుడు సినిమాలో బాలకృష్ణ చిన్నతనంలో పాత్రను బాలకృష్ణ చిన్న కూతురు కొడుకు నటించారు. మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ బాల్యంలోని సన్నివేశాల్లో లోకేష్, బ్రహ్మణిల తనయుడు దేవాన్ష్ నటించారు. ఎన్టీఆర్ చిన్నతనంలో స్కూల్ కు వెళ్లే సన్నివేశంతో పాటు స్కూల్‌లో ఓ చిన్న పద్యాన్ని చెప్పే సన్నివేషాన్ని కూడ ఈ సినిమాలో దేవాన్ష్‌పై ఉంది. 

సంబంధిత వార్తలు

'మహానాయకుడు' సినిమా: నాదెండ్లే విలన్