డిప్యూటీ సీఎం కొడుకు కారునే ఆపుతావా అంటూ..కొందరు యువకులు విశాఖ పట్నంలో హల్ చల్ చేశారు. వీరు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అనుచరులుగా తేలింది. వీరు విశాఖ బీచ్ రోడ్‌లో హల్ చల్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

అర్ధరాత్రి బీచ్ రోడ్‌లో రాష్ డ్రైవింగ్ చేస్తున్న కారును నైట్ డ్యూటీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆపాడు. దీంతో వారు రెచ్చిపోయారు. కానిస్టేబుల్‌ను దుర్భాషలాడారు. ‘నువ్వెంత..నీ బ్రతుకెంత.. డిప్యూటీ సీఎం కొడుకు కారునే ఆపుతావా అంటూ’.. పోలీస్‌పై దౌర్జన్యం చేశారు. 

దీంతో కానిస్టేబుల్‌ తన పై అధికారికి సమాచారం ఇచ్చారు. అంతేకాదు ఈ విషయాన్ని ధర్మాన కృష్ణదాసు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎటువంటి కేసు లేకుండా పోలీస్ అధికారులు రాజీ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.