ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్దంగానే ఉన్నామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్దంగానే ఉన్నామని ఆయన అన్నారు. ఎన్నికలు ఏ క్షణమైనా అయినా రావొచ్చని ఆలోచనతో పనిచేస్తున్నామని తెలిపారు. అయితే ఎన్నికలు వస్తాయని తమ పెద్దలు ఏం చెప్పడం లేదని.. అయితే రేపు వచ్చినా రెడీగా ఉండాలనే ఆలోచనతో ఫైట్ చేస్తున్నామని చెప్పారు. ఇటు ప్రజలకు మంచి జరగాలి.. ఇటు మళ్లీ సీఎం జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలనేది తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పటి నుంచే తాము ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు సిద్దపడుతున్నామని తెలిపారు.
ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రావొచ్చని.. సీఎం జగన్ ఆ దిశగా ఆలోచనతో ఉన్నారని ప్రతిపక్ష పార్టీలు చెప్పుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని పలు సందర్బాల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. వైసీపీ అధిష్టనం కూడా ముందస్తుకు వెళ్లేది లేదని స్పష్టం చేసింది.
