సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్ చేసుకోవడమే పవన్ కి ఉత్తమమని ఆయన హితవు పలికారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై డిప్యుటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ విమర్శల వర్షం కురిపించారు. పవన్ రాజకీయాలకు పనికిరాడని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ధర్మాన కృష్ణ ప్రసాద్.. పవన్ పై విమర్శలు చేశారు. సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్ చేసుకోవడమే పవన్ కి ఉత్తమమని ఆయన హితవు పలికారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని, వైఎస్‌ జగన్‌తో పవన్‌ పోల్చుకోకుండా ఉంటే మంచిదన్నారు. ‘‘పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతీ గ్రామాన్నీ తిరిగిన నాయకుడు వైఎస్‌ జగన్‌. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉన్న నేత జగన్‌.. ప్రజల్లో లేరంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరు. ఆయనకు పోటీ ఎవరూ లేరు. జగన్‌కు జగనే సాటి. సీఎంను విమర్శించే ముందు పవన్, లోకేష్ విజ్ఞతతో ఆలోచించాలని ధర్మాన కృష్ణదాస్‌ హితవు పలికారు.