Asianet News TeluguAsianet News Telugu

మరీ ఇంత దారుణమా.. స్వచ్ఛాంధ్ర నిధులు ఏమైనట్లు..? అధికారులను సూటిగా ప్రశ్నించిన పవన్ కల్యాణ్

‘‘స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో జగన్‌ ప్రభుత్వం మిగిల్చింది రూ.7 కోట్లు మాత్రమే. ఈ ఇధులు 5 నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉన్న కార్పొరేషన్‌లో... ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు?‘‘

Deputy Chief Minister Pawan Kalyan is in awe of Swachhandhra Corporation's activities GVR
Author
First Published Jun 27, 2024, 12:51 PM IST

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల వ్యవహారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విస్మయం వ్యక్తం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆ కార్పొరేషన్ ఖాతాలో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే.. ప్రస్తుతం రూ.7కోట్లు మాత్రమే మిగిల్చారన్న విషయం తెలుసుకొని విస్తుపోయారు. మంగళగిరిలోని నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్‌కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై ఆయన సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు.

2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించింది. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదైంది... దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్ళాయి, ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.70కోట్లు నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు అందించింది. ఆ మొత్తంలో రూ.46 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో రూ.239 కోట్లు నిధులు సమకూరాయి. ఖర్చు రూ.209 కోట్లు మేర చేశారు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి రూ.7.04 కోట్లు మాత్రమే. 

నిధుల మళ్లింపు.. వ్యవస్థలు నిర్వీర్యం
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగిస్తేనే ఆ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సదుద్దేశంతో, ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకువచ్చారు. అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఏర్పాటైంది. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం ద్వారా ఆ మొత్తానికి వడ్డీ లభిస్తుంది. అయినా సక్రమంగా వినియోగించకుండా- ఇతర అవసరాలకు మళ్లించడం గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకు 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఆయ్యేనాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం రూ.3 కోట్లు మిగల్చడమే ఉదాహరణగా పేర్కొన్నారు. దీన్నిబట్టే వైసీపీ పాలకులు నిధుల మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారని విమర్శించారు. 

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2,092 కోట్లు నిధి ఉంటే... ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే  పరిస్థితి ఎందుకు వచ్చింది? అని పవన్‌ కల్యాణ్‌ అధికారులను ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలని, గత అయిదేళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని అధికారులకు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios