Asianet News TeluguAsianet News Telugu

బాబుకు షాక్: సీఆర్‌డీఏ రద్దు, సమగ్రాభివృద్ధి బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి బిల్లులకు ఏపీ అసెంబ్లీ మంగళవారం నాడు ఆమోదం తెలిపింది. ఈ రెండు కీలక బిల్లులకు ఇవాళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
 

Decentralisation CRDA repeal Bills passed in Ap assembly
Author
Amaravathi, First Published Jun 16, 2020, 5:53 PM IST

 అమరావతి: సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి బిల్లులకు ఏపీ అసెంబ్లీ మంగళవారం నాడు ఆమోదం తెలిపింది. ఈ రెండు కీలక బిల్లులకు ఇవాళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఏపీ అసెంబ్లీలో  వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ బిల్లులను ప్రవేశపెట్టారు.ఈ బిల్లులను మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ప్రవేశపెట్టారు. 

కోర్టులో ఉన్న బిల్లులను మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం సరైంది కాదని బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల అభ్యంతరాలను ఖాతరు చేయకుండానే ఏపీ ప్రభుత్వం ఈ రెండు బిల్లులను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 

ఈ రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ది బిల్లులు శాసనమండలి సెలెక్ట్ కమిటికి పంపింన విషయం తెలిసిందే. అయితే సెలెక్ట్ కమిటిని ఇంకా ఏర్పాటు చేయలేదు. 

సెలెక్ట్ కమిటి ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఏపీ హైకోర్టులో ఇటీవలనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఈ బిల్లులను అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తెలపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ రెండు బిల్లులను ప్రభుత్వం  అసెంబ్లీలో జనవరి మాసంలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను వాయిస్ ఓటుతో ఆమోదం పొందింది. ఒక్కరోజు సుధీర్ఘ చర్చించిన తర్వాత జనవరి 20న ఈ బిల్లులను వాయిస్ ఓటుతో అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఆ తర్వాత ఈ బిల్లులను శాసనమండలి ముందుకు తీసుకెళ్లారు. శాసనమండలిలో టీడీపీ సభ్యుల ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని కోరారు.  అయితే సెలెక్ట్ కమిటి ఇంతవరకు ఏర్పాటు కాలేదు.


 

Follow Us:
Download App:
  • android
  • ios