వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో మృతదేహం..!
వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. చనిపోయిన వ్యక్తి అనంతబాబు దగ్గర గతంలో డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి అని తెలుస్తోంది.
కాకినాడ : వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు అలియాస్ అనంతబాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభించింది. గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యంగా ఆ యువకుడిని గుర్తించారు. నిన్న రాత్రి తమ కొడుకుని ఎమ్మెల్సీ తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంటూ మృతదేహాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకొని వచ్చారు. కాగా, బాధితుల ఆందోళనతో అనంతబాబు కారు వదిలి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యంను హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఎమ్మెల్సీ మాత్రం రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.