Asianet News TeluguAsianet News Telugu

గోదావరిలో తేలిన మృతదేహాల మిస్టరీ... అమ్మ చనిపోవడం తట్టుకోలేకే...

నాన్న..నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు..  మేము ముగ్గురం మిగిలిన పనులు చూసుకుని త్వరగా ఇంటికి వచ్చేస్తాం..అవే చివరి మాటలు అవుతాయని అనుకోలేదు అంటూ ఆ తండ్రి బోరున విలపిస్తున్నారు. భార్య మృతి గుండెలు పిండేస్తుంటే..బిడ్డలు ఇంకా ఇంటికి రాలేదని ఎదురుచూస్తుండగా.. గోదావరిలో మునిగి చనిపోయింది తన పిల్లలేం అని తెలియడంతో ఆ తండ్రి హతాశుడయ్యాడు.

dead bodies found on godavari river bank in rajamahendravaram, mystery solved - bsb
Author
Hyderabad, First Published Jun 8, 2021, 9:31 AM IST

నాన్న..నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు..  మేము ముగ్గురం మిగిలిన పనులు చూసుకుని త్వరగా ఇంటికి వచ్చేస్తాం..అవే చివరి మాటలు అవుతాయని అనుకోలేదు అంటూ ఆ తండ్రి బోరున విలపిస్తున్నారు. భార్య మృతి గుండెలు పిండేస్తుంటే..బిడ్డలు ఇంకా ఇంటికి రాలేదని ఎదురుచూస్తుండగా.. గోదావరిలో మునిగి చనిపోయింది తన పిల్లలేం అని తెలియడంతో ఆ తండ్రి హతాశుడయ్యాడు.

మూడు రోజుల పాటు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోనే మృతదేహాలు ఉండగా... ఎవరు గుర్తించలేదని పోలీసులే కననం చేశారు. అయ్యో ఆఖరి చూసూ దక్కలేదే..  అంటూ ఆయన రోధిస్తుంటే చూసినవారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇటీవల రాజమహేంద్రవరం లోని ఇసుక రేవు వద్ద గోదావరిలో తేలిన ముగ్గురు మృతదేహాల విషాద ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం…

కొవ్వూరు లోని బాపూజీ నగర్ ప్రాంతానికి చెందిన మామిడిపల్లి నరసింహం రైల్వేలో గ్యాంగ్ మెన్ గా పనిచేసి 2014లో రిటైర్ అయ్యాడు. ఆయన భార్య మాణిక్యం (58) తో పాటు ఇద్దరు కుమార్తెలు కన్నా దేవి (34), నాగమణి (32) కుమారుడు దుర్గారావు 30 ఉన్నారు.  ముగ్గురు పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో పదో తరగతిలోనే చదువు మానేశారు. కూతుళ్లు ఇంటివద్దనే ఉంటుండగా కొడుకు రాజమహేంద్రవరం లోని మొబైల్ దుకాణంలో పనిచేస్తున్నాడు.

లైంగిక వేధింపులు: నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండ్ సస్పెన్షన్...

 తన పెళ్లి కన్నా ముందు సొంత ఇల్లు కట్టుకుందామన్న పెద్ద కూతురు కన్నాదేవి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు కాదనలేకపోయారు.  గతేడాది స్వస్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అంతలోనే ఇంటావిడ మాణిక్యానికి  ఊపిరితిత్తుల వ్యాధి సోకింది.  ఆమెను గత నెల 27న రాజమహేంద్రవరం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు.  29న ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 

 చికిత్స పొందుతూ 31వ తేదీన మధ్యాహ్నం మృతి చెందింది మాణిక్యం.  ఆ రోజు సాయంత్రం స్థానిక కైలాస భూమిలో అంత్యక్రియలు పూర్తి చేశారు.  ఆ తర్వాత ఏడు గంటల సమయంలో.. తండ్రిని, మేనమాన  నాగేశ్వరరావును మీరు ఇంటికి వెళ్ళండి… మేము పనులు చూసుకుని వస్తాము అని చెప్పడంతో వారు వెళ్ళిపోయారు. అనంతరం కన్నా దేవి, నాగమణి, దుర్గారావు నడుచుకుంటూ ఇసుక రేవు వద్దకు వెళ్లారు.

ఎవరో ముగ్గురు ఇక్కడ కూర్చుని ఏడ్చారు అంటూ విచారణ సమయంలో అక్కడి జాలర్లు పోలీసులకు చెప్పడంతో... తల్లి మరణంతో మనస్థాపానికి గురైన బిడ్డలు ముగ్గురు నదిలో మునిగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. కేసు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మరిన్ని విషయాలు త్వరలో తెలియజేస్తామని ఎస్ఐ నవీన్ తెలిపారు.

మొన్నటి వరకు పిల్లలతో పాటు ముగ్గురు సంతానం తో ఆనందంగా గడిపిన అతనిపై విధి పంజా విసిరింది. కోలుకోలేని జబ్బుతో భార్య,  తట్టుకోలేని ఆవేదనతో ముగ్గురు పిల్లలు బలవన్మరణం పొందడంతో ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. ఈ విషాద సంఘటనలు స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

Follow Us:
Download App:
  • android
  • ios