శ్రీవారి భక్తులకు అలర్ట్.. పవిత్రోత్సవాల సందర్భంగా దర్శనవేళల్లో మార్పులు: టీటీడీ
పవిత్రోత్సవాల కారణంగా శ్రీవారి దర్శనవేళల్లో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. పవిత్రోత్సవాల సందర్భంగా దర్శనం ఆలస్యమయ్యే అవకాశం వుందని వెల్లడించింది.
తిరుమలలో భక్తుల రద్దీ (tirumala rush) గణనీయంగా పెరిగింది. 29 కంపార్ట్‌మెంట్లు నిండి బయట దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 14 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇకపోతే.. శ్రీవారి పవిత్రోత్సవాల సందర్భంగా దర్శనవేళల్లో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. పవిత్రోత్సవాల సందర్భంగా దర్శనం ఆలస్యమయ్యే అవకాశం వుందని వెల్లడించింది.
అంతకుముందు కొద్దిరోజుల క్రితం బ్రహ్మోత్సవాలపై టీటీడీ (ttd) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy) సమీక్ష నిర్వహించారు. కరోనాతో రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27న సాయంత్రం 5.05 గంటలకు ధ్వజారోహణం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తులు కోవిడ్ రూల్స్ పాటించాలని సుబ్బారెడ్డి తెలిపారు. మరోవైపు 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి వున్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,628 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 32,604 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే నిన్న శ్రీవారికి రూ.4.11 కోట్ల హుండీ ద్వారా వచ్చింది.
Also Read:శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. వైవీ సుబ్బారెడ్డి సమీక్ష, భక్తులకు కీలక సూచనలు
కాగా.. జూలై నెలలో శ్రీవారికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. మొదటి సారిగా జూలై నెలలో శ్రీవారికి రూ.139.45 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో మే నెలలో 130.5 కోట్లు వచ్చింది. తద్వారా వరుసగా ఐదో నెలలో ఆదాయం రూ.100 కోట్లు దాటింది.