Purandeswari : జగన్ సర్కార్ పై పురందేశ్వరి తీవ్ర విమర్శలు.. ఒక్కసారిగా హీటెక్కిన పాలిటిక్స్..
Purandeswari : ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పురందేశ్వరి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అవకాశం దొరికినప్పడల్లా.. వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. తాజాగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు పురందేశ్వరి. ఆమె వ్యాఖ్యలతో మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచేసింది.

Purandeswari : బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దగ్గుబాటి పురందేశ్వరి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అధికార వైసీపీకి, ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఇక టీడీపీ నేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
తాజాగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు పురందేశ్వరి. ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసక పాలన కొనసాగుతోందనీ, జగన్ దారుణాలను ప్రజలు గమనిస్తున్నారని పురందేశ్వరి విరుచుకపడ్డారు. ఒంగోలులో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వైఖరిపై పురందేశ్వరి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారనీ, వారిపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు.
27 ఎస్సీ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. అలాగే.. రాష్ట్రంలో బీసీ,ఎస్సీలపై దాడులు జరగుతున్నాయని, వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని పురందేశ్వరి ఆరోపించారు. నిధులు, విధులు లేని 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని సెటైర్లు వేశారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలను హింసిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. వెనుకబడిన వర్గాల కోసం సామాజిక బస్సు యాత్ర నిర్వహించే హాస్యాస్పదమని, అర్హత వైసీపీకి ఇలా యాత్రలు చేసే అర్హత లేదని పురందేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధాని మోడీకి ఓ స్పష్టమైన వైఖరి ఉందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.ప్రధాని మోడీ తన తొమ్మిదిన్నరేళ్ళలో అవినీతి రహిత పాలన కొనసాగించారనీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని స్పష్టం చేశారు.
దేశంలో ప్రధాని మోడీ సుపరిపాలనను అందిస్తుంటే.. అధికార వైసీపీ మాత్రం కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. జగన్ సర్కార్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.