హైదరాబాద్: ఫణి తుఫాన్ దూసుకొస్తోంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిజాంపట్నం ఎయిర్‌పోర్ట్‌లో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఫణి తుఫాన్  కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. మత్య్సకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు ఫణి తుఫాన్  ప్రస్తుతం ట్రింకోమలికి 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నైకు 1100 కి.మీ. మచిలీపట్నానికి 1260 కి.మీ దూరంలో ఉంది.  ఈ నెల 30వ తేదీ వరకు ఈ తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు  చెప్పారు.

తమిళనాడు, కోస్తాంధ్ర తీరాలకు ఫణి తుఫాన్ అతి దగ్గరగా రానుందని వాతావరణ నిపుణులు ప్రకటించారు. 24 గంటల్లో ఈ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్‌గా మారే  అవకాశం ఉంది. రేపటి నుండి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఏప్రిల్, మే 1వ తేదీ వరకు ఫణి తుఫాన్ ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు.

మే 1 తేదీ తర్వాత సముద్రంలోనే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే 1వ తేదీన దిశ మార్చుకొన్న తర్వాత కూడ కొంత సేపు సముద్రంలోనే తుఫాన్ ఉండే అవకాశం లేకపోలేదని వాతావరణ నిపుణులు ప్రకటించారు. మే 1వ తేదీన దిశ మార్చుకొన్న తర్వాత ఈశాన్య దిశగా తుఫాన్ ప్రయాణం చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీపై ఈ తుఫాన్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని చెబుతున్నారు ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాపై కొంత ప్రభావం కన్పించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.ఏపీలో ఒకటి రెండు  చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని  వాతావరణ నిపుణులు హెచ్చరించారు. దిశ మార్చుకొన్న తర్వాత సముద్రంలోనే ఉంటుంది. కొంతసేపు సముద్రంలో ఉంటుంది.ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాపై ప్రభావం ఉండదు