ఆరేళ్ల క్రితం పొగొట్టుకున్న సొమ్ము.. మళ్లీ దొరికింది. సైబర్ మోసగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయి.. ఇక దొరకదు అనుకున్న సొమ్ము.. మళ్లీ దొరకడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కంకిపాడు ప్రాంతానికి చెందిన మీరా సాహెబ్ ఆయుర్వేద వైద్యుడు. 2014లో ఓ పత్రికలో రుణాల మంజూరు పై వచ్చిన ప్రకటనకు ఆకర్షితుడై ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనడంతో వారి మాటలు నమ్మి వారి ఖాతాలో రూ.66,700 జమ వేశారు.

రోజులు గడుస్తున్నా.. రుణం  రాకపోవడంతో సదరు వ్యక్తిని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. అయినా లాభం కనిపించడలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇప్పటికి బాధితుడికి న్యాయం చేయలగలిగారు.

బాధితుడు పోగొట్టుకున్న మొత్తాన్ని డీడీ రూపంలో తాజాగా పోలీసులు వారికి అందజేశారు. కాగా.. తాము ఇక రాదు అని అనుకన్న సొమ్ము తిరిగి ఇచ్చినందుకు సైబర్ పోలీసులు బాధిత కుటుంబం దన్యవాదాలు తెలియజేసింది.