నాలుగు నెలల వ్యవధిలో ప్రాజెక్టు పరిసరాల్లో మూడు సార్లు భూమి కుంగిపోవడం ఆందోళనకరంగా మారింది. వరుస ఘటనలతో ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు వద్ద మరోమారు భూమి కుంగిపోయింది. ప్రాజెక్టు వద్ద 902 ఏరియాలో భూమి బీటలు వారుతుంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కొద్ది దూరంలో భూమి 20 అడుగులు పైకి ఎగదన్ని నెర్రెలు బారింది.
ఆ తరువాత కొద్ది రోజులకే స్పిల్‌వే రెస్టారెంట్ వద్ద భూమి కంపించి పగుళ్లు ఏర్పడ్డాయి. పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న రెస్టారెంట్ లోపల సైతం భయంకరంగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో రెస్టారెంట్ సిబ్బంది భయకంపితులై బయటకు పరుగులు తీశారు.
నాలుగు నెలల వ్యవధిలో ప్రాజెక్టు పరిసరాల్లో మూడు సార్లు భూమి కుంగిపోవడం ఆందోళనకరంగా మారింది. వరుస ఘటనలతో ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.