విజయవాడ: ప్రజావేదిక కూల్చివేతపై సీపీఎం సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక కూల్చివేత మంచిదేనని జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అయితే అది ప్రజావేదికతోనే నిలిచిపోకూడదని మిగిలిన వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ప్రజావేదికను కూల్చి మిగిలిన భవనాలను వదిలేస్తే అది కక్ష పూరిత చర్యే అవుతుందని అభిప్రాయపడ్డారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. 

తెలుగుదేశం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో వీటి నిర్మాణం పెరిగిందంటూ ధ్వజమెత్తారు. అక్రమ కట్టడాలు కూల్చివేతపై కూడా ఏపీలో రాజకీయం చేయడం దురదృష్టకరమంటూ బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు.