Asianet News TeluguAsianet News Telugu

వివేకాను చంపిందెవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలకు తెలుసు: సీపీఐ రామకృష్ణ

వైఎస్ వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామని సీబీఐ అనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని పేర్కొన్నారు.

cpi ramakrishna comments on cbi reward in viveka murder case
Author
Amaravathi, First Published Aug 22, 2021, 6:03 PM IST

మాజీ  మంత్రి , ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.  ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన, వివేకా హత్య కేసులో కీలక సమాచారం అందించినవారికి సీబీఐ రూ.5 లక్షలు నజరానా ప్రకటించడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని రామకృష్ణ పేర్కొన్నారు.

Also Read:వైఎస్ వివేకా హంతకులను పట్టిస్తే రూ. 5 లక్షల నజరానా: సీబీఐ ప్రకటన

అటు ప్రకాశం జిల్లా అంశాలపై రామకృష్ణ వ్యాఖ్యానిస్తూ, వెలిగొండ ప్రాజెక్టును కేంద్రం గెజిట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. పనులు పూర్తయినా నీళ్లు విడుదల చేయని ఏకైక ప్రాజెక్ట్ వెలిగొండ అని ఆయన గుర్తుచేశారు. టిడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని రామకృష్ణ విమర్శించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు
 

Follow Us:
Download App:
  • android
  • ios