వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠ్ అధ్యాపకుల నియామకంలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదంటూ ఆయన మంగళవారం యూజీసీ ఛైర్మన్ డీపీ సింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ... రిజర్వేషన్ల అంశమై యూజీసీ ఛైర్మన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్కువ సమయంలో ఎక్కువ మంచి పనులు చేస్తున్నారని నారాయణ కొనియాడారు. తద్వారా డైనమిక్ సీఎం అనిపించుకుంటున్నారని ఆయన ప్రశంసించారు.