గుంటూరు: కోవిడ్ మృతదేహం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటుచేసుకుంది. కరోనా  సోకి హాస్పిటల్ లో చికిత్సపొందుతూ మరణించిన వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కరోనా మృతదేహానికి ప్యాక్ చేయాల్సి ఉన్నా అలా చేయకుండానే బయటకు తరలించారు. అందేకాకుండా మృతదేహాన్ని తరలించిడానికి అంబులెన్స్ ను ఏర్పాటుచేయాల్సి వుండగా ఓ రిక్షాలో తరలించారు.  

ఇలా కరోనా మృతదేహాన్ని అత్యంత నిర్లక్ష్యంగా రిక్షాలో తరలిస్తుండగా బాపట్లవాసులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా ఈ ఘటన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దృష్టికి  వెళ్లడంతో ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసిప డిప్యూటీ స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇటీవల తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించడంలో గందరగోళం చోటు చేసుకుంది. మృతదేహం తరలింపులో నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 

మృతదేహాన్ని ఆటోలో తరలించారు. అలా తరలించడం కరోనా వైరస్ మార్గదర్శకాలకు విరుద్ధం. కోరనా రోగి మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎస్కార్టు వాహనంతో తరలించాల్సి ఉంటుంది. పైగా, మృతదేహాన్ని తరలించిన ఆటో  డ్రైవర్ కు గానీ, అతని పక్కన కూర్చున వ్యక్తికి గానీ పీపీఈ కిట్లు లేవు.

 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని ఆటోలో తరలించాల్సి వచ్చిందని అంటున్నారు. ఆస్పత్రిలో ముగ్గురు కరోనా వైరస్ రోగులు మరణించారని, దాంతో అంబులెన్స్ అందుబాటులో లేదని చెబుతున్నారు. ఇపుడు బాపట్లలో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇ