కరోనా వైరస్: చెన్నైలో నెల్లూరు డాక్టర్ మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన వైద్యుడు తమిళనాడు రాజధాని చెన్నైలో కరోనా వైరస్ తో మరణించాడు. కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని ఏప్రిల్ 5న చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Covid -19: Nellore doctor dies in Chennai with coronavirus
చెన్నై: కరోనా వైరస్ బారిన పడి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించాడు. సోమవారం తెల్లవారు జామున అతను మరణింటాడు. తమిళనాడులో సోమవారం సాయంత్రానికి కొత్తగా 98 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ సోకినవారిలో ముగ్గురు డాక్టర్లు కూడా ఉన్నారు.

తమిళనాడులో 1,173 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ కు నెల్లూరులో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అతన్ని ఏప్రిల్ 5వ తేదీన చెన్నై తీసుకుని వచ్చారు. అతని మరణాన్ని ఆంధ్రప్రదేశ్ జాబితాలో చేరుస్తామని అధికారులు చెప్పారు. 

డాక్టర్ మృతదేహానికి అంత్యక్రియలు చేయడం ఇబ్బందిగా మారింది. స్మశానవాటిక సమీపంలోని ప్రజలు అతని అంత్యక్రియలను వ్యతిరేకించారు. అది తమకు ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉందని వారు అభ్యంతరం చెప్పారు. 

డాక్టర్లకు కూడా కరోనా వైరస్ సోకుతుండడడంతో తమిళనాడు ఆరోగ్య శాఖపై ఒత్తిడి పెరిగింది. కోయంబత్తూర్ వైద్య కళాశాల వైద్య విద్యార్థికి, ఈఎస్ఐసీ ఆస్పత్రిలో విధులు నిర్వహించిన మరో వైద్య విద్యార్థికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు 11 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేశ్ చెప్పారు.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios