అమరావతి: టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు.

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో గ్రామ సర్పంచ్ పదవికి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధి అప్పన్న అనే వ్యక్తిని బెదిరించారనే ఫిర్యాదుతో ఆయనను  పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

అచ్చెన్నాయుడును కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుండి ఆయనను మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపర్చారు. అచ్చెన్నాయుడికి 14 రోజుల పాటు రిమాండ్ ను విధించింది కోర్టు. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. 

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో  నిమ్మాడలో వైసీపీ అభ్యర్ధిని నామినేషన్ దాఖలు చేయకుండా అచ్చెన్నాయుడు అడ్డుకొన్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయమై ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు కూడా చేసింది.