కరోనా ఎఫెక్ట్:తెనాలిలో రెండు రోజుల్లో భార్యాభర్తలు మృతి

గుంటూరు జిల్లా తెనాలి మండలం నేలపాడులో  రెండు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మరణించారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.  

couple dead within two days in Tenali  lns

 తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి మండలం నేలపాడులో  రెండు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మరణించారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.  నేలపాడుకు చెందిన రమేష్  తెనాలి పట్టణంలో ఫాస్టర్ గా పనిచేస్తున్నాడు.  రమేష్ మాధవి ఏఎన్ఎంగా పనిచేస్తోంది.  వారం క్రితం రమేష్ కు  కరోనా సోకింది.  దీంతో ఆయన చికిత్స  కోసం గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేరారు. 

రమేష్ కు కరోనా సోకిన రెండు రోజులకే  ఆయన భార్య మాధవికి కరోనా సోకింది.  ఆమె కూడ ఇదే ఆసుపత్రిలో చేరింది.  కరోనాతో ఆరోగ్యం విషమించడంతో  ఈ నెల 16న రమేష్ మరణించాడు.  ఇవాళ రమేష్ భార్య మాధవి చనిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.  రెండు రోజుల వ్యవధిలో నే భార్యాభర్తలు మరణించడంతో  పిల్లలు ఒంటరివారయ్యారు.

ఏపీ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ కేసుల పెరుగుదలను అరికట్టేందుకు జగన్ సర్కార్ అన్ని చర్యలు తీసుకొంటుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్రానికి అవసరమైన  వ్యాక్సిన్ డోసులు పంపాలని కూడ ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios