గుంటూరు: తొమ్మిది నెలలు మోసి కని పెంచి పోషించిన కన్నతల్లినే అత్యంత దారుణంగా కడతేర్చాడో కసాయి కొడుకు. పాలిచ్చి పెంచిన తల్లికి సేవలు చేయలేక ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. మానవత్వానికి మచ్చతెచ్చే ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని ఐదవ వార్డులో గండ్రకోట లీలావతి(76) అనే వృద్దురాలు నివాసముంటోంది. ఆమె కొడుకు రామకృష్ణ ఉపాధినిమిత్తం కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోనే నివాసముంటున్నారు. దీంతో ఒంటరిగా వుంటున్న తల్లికి సేవలు చేసేందుకు ఓ పనిమనిషిని ఏర్పాటుచేశాడు. 

అయితే ఇటీవల లీలావతి నివాసముండే ఇంటి చుట్టూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు సేవలు చేసే పని మనిషి కొద్దీ రోజులుగా రావడం లేదు.
 దీంతో కొడుకు హైదరాబాద్ నుండి తల్లివద్దకు వచ్చారు. 

read more  50 వేలకు చేరువలో.. ఏపీలో కరోనా ఉగ్రరూపం : కొత్తగా 5,041 కేసులు... 56 మరణాలు

అయితే తల్లికి సేవలు చేయడం కష్టంగా భావించిన ఆ కసాయి కొడుకు దారుణానికి పాల్పడ్డారు. తనకు ప్రాణాలు పోసిన తల్లి మరిచిపోయి ఆమెను హతమార్చాడు. సోమవారం తెల్లవారుజామున ఫుల్లుగా మద్యం సేవించి తల్లి గొంతు కోసి చంపాడని స్థానికులు చెబుతున్నారు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నా రు. కరోనా పాజిటివ్ కేసులు ఇంటి చుట్టూ అధికంగా వున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇంటిలోకి వెళ్ళేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.