కరోనా పంజా: కర్నూలులో 156కి చేరిన కేసులు
తాజాగా పాజిటివ్ వచ్చిన వారిలో నంద్యాల పట్టణానికి చెందిన ఐదుగురు, నంద్యాల రూరల్ ఒకరు, చాగలమర్రి ఒకరు, తుగ్గలి మండలం ఆర్.కొట్టాల ఒకరు, శిరివెళ్ల ఒకరు, కర్నూలు రూరల్‌లో ఒకరితో పాటు కర్నూలు నగరానికి చెందిన 16 మంది ఉన్నారు. వీరిలో తాజాగా ఓ యువకుడు కోలుకొని ఇంటికి వెళ్లాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ కేసులు ఎక్కువగా కర్నూలు జిల్లాలో నమోదయ్యాయన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసులు మరిన్ని పెరిగాయి. ప్రస్తుతం కర్నూలులో 156మంది కి కరోనా సోకినట్లు అధికారులు నిర్థారించారు.
ఆదివారం జిల్లాలో మరో 26 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 156కు చేరింది. తాజాగా పాజిటివ్ వచ్చిన వారిలో నంద్యాల పట్టణానికి చెందిన ఐదుగురు, నంద్యాల రూరల్ ఒకరు, చాగలమర్రి ఒకరు, తుగ్గలి మండలం ఆర్.కొట్టాల ఒకరు, శిరివెళ్ల ఒకరు, కర్నూలు రూరల్‌లో ఒకరితో పాటు కర్నూలు నగరానికి చెందిన 16 మంది ఉన్నారు. వీరిలో తాజాగా ఓ యువకుడు కోలుకొని ఇంటికి వెళ్లాడు.
కేవలం కర్నూలు నగరంలోనే 80 కేసులు నమోదుకావడం గమనార్హం. నంద్యాల మున్సిపాలిటీలో 25, ఆత్మకూరు ఐదు, నందికొట్కూరు మూడు, డోన్ ఒకటి, బేతంచర్ల మున్సిపాలిటీలో ఒకటి, నంద్యాల మండలంలో 8, పాణ్యం 7, బనగానపల్లె 5, చాగలమర్రి నాలుగు, కోడుమూరు మూడు, గడివేముల రెండు, శిరివెళ్ల మూడు, కర్నూలు రెండు, ఓర్వకల్లు ఒకటి, నందికొట్కూరు ఒకటి, అవుకు ఒకటి, రుద్రవరం ఒకటి, సంజామల ఒకటి, తుగ్గలి మండలంలో ఒకటి చొప్పున నమోదయ్యాయి. అలాగే జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణలోని గద్వాలకు చెందిన ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
జిల్లా వ్యాప్తంగా అప్రమత్తం అయిన అధికారులు.. 27 మండలాలు, 10 మున్సిపాలిటీలను రెడ్ జోన్లుగా ఏర్పాటు చేశారు. రాకపోకలను నిలిపి వేసి అత్యవసర సేవలు డోర్ డెలివరీలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఉదయం 9 నుంచి బయటకు వచ్చే వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలు సిజ్ చేస్తున్నారు. కరోనా అనుమితులుగా భావించిన పలువురికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3537మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు.