Asianet News TeluguAsianet News Telugu

"అనంత" కరోనా ఆందోళన: మళ్లీ లాక్ డౌన్ అమలు

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ -19 కేసుల సంఖ్య అనంతపురం జిల్లాలో వేయి మార్కును దాటింది. దీంతో ప్రధాన పట్టణాల్లో అధికారులు మళ్లీ లాక్ డౌన్ విధించారు.

Coronavirus positive cases cross 1000 in Ananthapur district
Author
Ananthapuram, First Published Jun 25, 2020, 1:26 PM IST

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకూ జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేయి మార్కును దాటింది. జిల్లాలో 1080 కేసులు నమోదయ్యాయి. 

దాంతో అనంతపురం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కదిరిల్లో లాక్ డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరళా నృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కోవిడ్ -19 వ్యాధితో మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గురువారంనాడు బులిటెన్ విడుదల చేసింది. 

రాష్ట్రానికి చెందినవారిలో 477 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 69 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో గత 24 గంటల్లో ఏపీలో మొత్తం 553 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

తాజాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో మరో ఏడుగురు కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. ఇందుల్లో కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరేసి, తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ తో మరణించినవారి సంఖ్య 136కు చేరుకుంది.

ఏపీలో 5760 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4988 మంది కోవిడ్ -19 నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. తాజాగా గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 52, చిత్తూరు జిల్లాలో 42, తూర్పు గోదావరి జిల్లాలో 64, గుంటూరు జిల్లాలో 67, కడప జిల్లాలో 47, కృష్ణా జిల్లాలో 47, కర్నూలు జిల్లాలో 72 కేసులు నమోదయ్యాయి.

నెల్లూరు జిల్లాలో 29, ప్రకాశం జిల్లాలో 18 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 40, విజయనగరం జిల్లాలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో మొత్తం 8783 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 371 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 

జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు

అనంతపురం 1080, మరణాలు 7
చిత్తూరు 699, మరణాలు 6
తూర్పు గోదావరి 824,  మరణాలు 6
గుంటూరు 958, మరణాలు 16
కడప 500, మరణాలు 1
కృష్ణా 1179, మరణాలు 45
కర్నూలు 1555, మరణాలు 44
నెల్లూరు 522, మరణాలు 4
ప్రకాశం 218, మరణాలు 2
శ్రీకాకుళం 61, మరణాలు 2
విశాఖపట్నం 407, మరణాలు 2
విజయనగరం 99
పశ్చిమ గోదావరి 681, మరణాలు 1

Follow Us:
Download App:
  • android
  • ios