అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ప్రతి రోజూ వేలాది కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 8,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 49 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 80858కి చేరుకుంది. కరోనా మరణాల సంఖ్య 933కు చేరుకుంది.

ఒక్క రోజులో మరోసారి తూర్పు గోదావరి జిల్లాలో వేయికి పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా 1029 కరోనా వైరస్ కేసులు రికార్డయ్యాయి. అనంతపురం జిల్లాలో 984, చిత్తూరు జిల్లాలో 630, గుంటూరు జిల్లాలో 703, కడప జిల్లాలో 494, కృష్ణా జిల్లాలో 359 కేసులు నమోదయ్యాయి.

కర్నూలు జిల్లాలో 914, నెల్లూరు జిల్లాలో 278, ప్రకాశం జిల్లాలో 355, శ్రీకాకుళం జిల్లాలో 374, విశాఖపట్నం జిల్లాలో 898, విజయనగరం జిల్లాలో 322, పశ్చిమ గోదావరి జిల్లాలో 807 కేసులు నమోదయ్యాయి. తద్వారా రాష్ట్రంలో కొత్తగా 8147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుంటేత, గత 24 గంటల్లో కొత్తగా తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది, కృష్ణా జిల్లాలో 9 మంది, కర్నూలు జిల్లాలో ఎనిమిది మంది, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, పశ్చిమ గోదావరి జిల్లో ఐదుగురు మరణించారు. గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి మృత్యువాత పడ్డారు. చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు. ఆ రకంగా ఒక్క రోజులో 49 మంది ఏపీలో మృత్యువాత పడ్డారు. 

ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు

అనంతపురం 8266, మరణాలు 81
చిత్తూరు 6569, మరణాలు 68
తూర్పు గోదావరి 11067, మరణాలు 107
గుంటూరు 8800, మరణాలు 88
కడప 4067, మరణాలు 29
కృష్ణా 4841, 133
కర్నూలు 9615, మరణాలు 150
నెల్లూరు 3726, మరణాలు 22
ప్రకాశం 3059, మరణాలు 46
శ్రీకాకుళం 3949, మరణాలు 52
విశాఖపట్నం 5061, మరణాలు 62
విజయనగరం 2402, మరమాలు 29
పశ్చిమ గోదావరి 6541, మరణాలు 66