Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కరోనా విశ్వరూపం: 40 వేలు దాటిన కేసులు, 534 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఏపీలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. ఒక్క రోజులోనే 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 534 మంది మృత్యువాత పడ్డారు.

Coronavirus cases cross 40 thousand in Andhra pradeshm death toll 534
Author
Amaravathi, First Published Jul 17, 2020, 2:43 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. తాజా కేసులతో మొత్తం 40,646 కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా సంభవిస్తూనే ఉన్నాయి. తాజా మరణాలతో సంఖ్య 534కు చేరుకుంది.

గత 24 గంటల్లో ఏపీలో 2602 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందినవారిలో 2592 మందికి కోరనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 8 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది.

గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా తన విశ్వరూపం ప్రదర్శించింది. ఒక్క రోజులోనే 643 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 297, చిత్తూరు జిల్లాలో 328, గుంట్ూరు జిల్లాలో 367, కడప జిల్లాలో 55, కృష్ణా జిల్లాలో 37, కర్నూలు జిల్లాలో 315 కేసులు నమోదయ్యాయి.

నెల్లూరు జిల్లాలో 127, ప్రకాశం జిల్లాలో 53, శ్రీకాకుళం జిల్లాలో 149, విశాఖపట్నం జిల్లాలో 23, విజయనగరం జిల్లాలో 89, పశ్చిమ గోదావరి జిల్లాలో 109 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మోత్తం 2461 మందికి కరోనా వైరస్ సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 434 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 

తాజాగా గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో ఆరుగురు మరణించారు. చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురేసి మృత్యువాత పడ్డారు. గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో నలుగురేసి కరోనా వైరస్ కారణంగా మరణించారు. కడప, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. 

ఏపీలో జిల్లాలవారీగా మొత్తం కరోనా వైరస్ కేసులు, మరణాలు

అనంతపురం 4284, మరణాలు 58
చిత్తూరు 3864, మరణాలు 43
తూర్పు గోదావరి 4505, మరణాలు 34
గుంటూరు 4330, మరణాలు 39
కడప 2275, మరణాలు 21
కృష్ణా 3021, మరణాలు 86
కర్నూలు 5131, మరణాలు 116
నెల్లూరు 1717, మరణాలు 18
ప్రకాశం 1448, మరణాలు 26
శ్రీకాకుళం 1852, మరణాలు 16
విశాఖపట్నం 1716, మరణాలు 28
విజయనగరం 1071, మరణాలు 13
పశ్చిమ గోదావరి 2537, మరమాలు 36 


 

Follow Us:
Download App:
  • android
  • ios