Asianet News TeluguAsianet News Telugu

తిరుమలకు వెళ్లివచ్చిన ఒకే కుటుంబంలో... ఐదుగురికి కరోనా పాజిటివ్

శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది.  తాజాగా జిల్లా కేంద్రంలోని చిన్నరెల్లి వీధిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకింది. 

corona update in srikakulam dist
Author
Srikakulam, First Published Jul 12, 2020, 11:52 AM IST

శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది.  తాజాగా జిల్లా కేంద్రంలోని చిన్నరెల్లి వీధిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకింది. ఇటీవలే తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది ఈ కుటుంబం. అక్కడినుండి వచ్చినతర్వాత వీరు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న వైద్య అధికారులు కుటుంబం మొత్తానికి టెస్టులు  నిర్వహించారు. ఈ క్రమంలోనే ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

ఇక ఇదే  శ్రీకాకుళంజిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌వో)ప్రధాన కార్యాలయం లో ఇద్దకె సిబ్బందికి కరోనా సోకింది. ఈ పాజిటివ్ కేసుల గురించి తెలియడంతో కార్యాలయాన్ని పూర్తిగా మూసి వేసే ఆలోచనలో అధికారులు వున్నట్లు సమాచారం. స్థానిక దమ్మల వీధిలో మరిన్ని కరోనా కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

read more  ఈ జిల్లాల్లో కరోనాల మరణాల విజృంభణ: తెలంగాణకు అంటగడుతున్న ఏపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 27 వేల మార్కును దాటింది. మొత్తం కేసుల సంఖ్య 27,235కు చేరుకుంది. కోవిడ్ -19 రోగుల మరణాల సంఖ్య 300 దాటింది. మొత్తం మరణాలు ఏపీలో 309 నమోదయ్యాయి.

ఆదివారం  ఒక్కరోజే ఏపీలో కొత్తగా 1813 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందినవారిలో 1775 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 34 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 

రాష్ట్రంలో నమోదైన 24,422 పాజిటివ్ కేసులకు గాను 12,300 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 11,714 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా రాష్ట్రానికి చెందినవారిలో 1775 మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 

శనివారం ఉదయం 9గంటల నుండి ఆదివారం 9గంటల వరకు ఏపీలో 17 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు మరణించారు. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి చనిపోయారు. అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరేసి మరణించారు. దీంతో రాష్ట్రంలో కోరనా వైరస్ మరణాల సంఖ్య 309కి చేరుకుంది.

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. అనంతపురం జిల్లాలో 311 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 300 కేసులు రికార్డయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 143, గుంటూరు జిల్లాలో 68, కడప జిల్లాలో 47, కృష్ణా జిల్లాలో 123 కేసులు నమోదయ్యాయి.

కర్నూలు జిల్లాలో 229, నెల్లూరు జిల్లాలో 76, ప్రకాశం జిల్లాలో 63, శ్రీకాకుళం జిల్లాలో 204, విశాఖపట్నం జిల్లాలో 51, విజయనగరం జిల్లాలో 76, పశ్చిమ గోదావరి జిల్లాలో 84 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో మొత్తం 2385 కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చినవారిలో 428 మందికి కోరనా వైరస్ సోకింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios