Asianet News TeluguAsianet News Telugu

నూజివీడు ట్రిపుల్ ఐటీలో మరో ల్యాబ్ అసిస్టెంట్ కరోనాతో మృతి...!

కృష్ణాజిల్లా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సిబ్బందికి కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ తో మరో లాబ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు(36) మృతి చెందాడు. 
 

corona positive : another lab assistant died in nuzvid IIIT at krishna district - bsb
Author
Hyderabad, First Published May 6, 2021, 11:28 AM IST

కృష్ణాజిల్లా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సిబ్బందికి కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ తో మరో లాబ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు(36) మృతి చెందాడు. 

ఇతనికి భార్య, ఒక బాబు(9), ఒక పాప(4) ఉన్నారు. కరోనా పాజిటివ్ కు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ట్రిపుల్ ఐటీలో మరికొంత మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం.

ట్రిపుల్ ఐటీలో కరోనా పరిస్థితులకు ఆందోళన చెందుతూనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులూ హాజరవుతున్నారు. వారం వ్యవధిలో ఇద్దరు లాబ్ అసిస్టెంట్ లు మృతి చెందడం,మరి కొంత మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం సెలవులు ప్రకటించడంలేదని సిబ్బంది వాపోతున్నారు. 

కాగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇప్పటికే పలువురికి కరోనా వైరస్ సోకడంతో కొందరు విద్యార్థులను ట్రిపుల్ ఐటీ అధికారులు ఇంటికి పంపించారు. కరోనా సోకి  ట్రిపుల్ ఐటీ లాబ్ అసిస్టెంట్ లీలా మురళి కృష్ణ(42) మరణించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం.....

ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్ష రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. కాగా కరోనా విలయతాండవం చేస్తున్నా సిబ్బంది యధావిధిగా విధులు నిర్వహిస్తుండడంతో, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా వైరస్ తీవ్రత ఇంకా పెరగకముందే ట్రిపుల్ ఐటీ అధికారులు చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

Follow Us:
Download App:
  • android
  • ios