Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై పోరాటానికి ప్రత్యేక యంత్రం... రాజధాని రోడ్లపై ప్రయోగం

ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తాడేపల్లి మున్సిపల్  అధికారులు  ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

corona outbreak... special sanitisation vehicle in  thadepalli
Author
Guntur, First Published Apr 13, 2020, 11:59 AM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా నివారణకు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికి ఈ వైరస్ మహమ్మారి రాష్ట్రంలో వేగంగా విజృంబిస్తుండటంతో మరింత అప్రమత్తమైన అధికారులు మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తాడేపల్లి మున్పిపల్ అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. 

కరోనా వైరస్ నియంత్రించడానికి ఓ ప్రత్యేక యంత్రాన్ని తెప్పించారు తాడేపల్లి అధికారులు. ఈ యంత్రం సాయంతో పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. తాడేపల్లిలో ప్రత్యేకంగా గుర్తించిన 23 స్లమ్ ఏరియాలో ఈ యంత్రంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. 

ఈ యంత్రం సాయంతో ఐదు పది మీటర్ల వెడల్పు  ఉన్న రోడ్లలో కూడా సులువుగా ద్రావణం పిచికారీ చేయగలుగుతున్నామని... మున్సిపల్ సిబ్బంది పనిని  ఈ యంత్రం ఎంతో సులువు చేసిందని తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం నాడు రాత్రి 9 గంటల నుండి సోమవారం నాడు ఉదయానికి కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 432కి చేరుకొన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే వున్నాయి. ఆదివారం రాత్రి 9 గంటల నుండి సోమవారం నాడు ఉదయానికి కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 432కి చేరుకొన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios