Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హాట్‌స్పాట్ జిల్లాలివే

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 11 వేలకు పైగా పాజిటివ్‌గా తేలగా, మరణాలు 500కు దగ్గరలో ఉన్నాయి. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రకటించి.. ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన సంతగి తెలిసిందే. 
Corona Hotspot Districts in AP and Telangana
Author
New Delhi, First Published Apr 15, 2020, 8:11 PM IST
దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 11 వేలకు పైగా పాజిటివ్‌గా తేలగా, మరణాలు 500కు దగ్గరలో ఉన్నాయి. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రకటించి.. ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన సంతగి తెలిసిందే.

దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కోవిడ్ 19 హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా ప్రకటించిన కేంద్రం ఆ జాబితాను బుధవారం ప్రకటించింది. లాక్‌డౌన్ పొడిగించినందున అవకాశం ఉన్నంత మేరకు కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 19 జిల్లాలు హాట్ స్పాట్ జాబితాలో ఉన్నాయి. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా 11 జిల్లాలు... తెలంగాణలో 8 జిల్లాలను హాట్‌స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది. 

దేశంలో రెడ్ జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 207, మిగతావి గ్రీన్ జోన్లో ఉన్నాయి. రెడ్ జోన్లో రెండు రకాలు విస్తృతి ఎక్కువున్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు - ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు

ఏపీలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్

తెలంగాణలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్

తెలంగాణలో రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్) జిల్లాలు: నల్గొండ

తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు: సూర్యాపేట, ఆదిలాబాద్. మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట
Follow Us:
Download App:
  • android
  • ios