Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, దేవినేని ఉమాలకు కేవీపీ సవాల్: పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధమా..!

పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు వల్లే తీరని అన్యాయం జరుగుతోందన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలకు కేవీపీ సవాల్ విసిరారు. 

congress senior leader kvp ramachandrarao Challenges to chandrababu on polavaram project
Author
Hyderabad, First Published May 6, 2019, 2:53 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వాసుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై మరోసారి బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. కేవీపీ లేఖపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 

పోలవరం ప్రాజెక్టుపై ఓనమాలు కూడా తెలియని వారు తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాను రాసిన లేఖను చదవకుండానే విమర్శలు చెయ్యడం దురదృష్టకరమన్నారు. మంత్రికి పోలవరంపై ఎంత అవగాహన ఉందో ఆయన మాటల్లోనే అర్థమవుతుందన్నారు. 

పోలవరం ప్రాజెక్టుపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నానని కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నదే తన ఆకాంక్ష అంటూ  చెప్పుకొచ్చారు. 18 నెలలుగా పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్ వేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు వల్లే తీరని అన్యాయం జరుగుతోందన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలకు కేవీపీ సవాల్ విసిరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios