Asianet News TeluguAsianet News Telugu

జగన్‌కు దూరంగా ఎందుకు ఉంటున్నారు?.. కేవీపీ కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు సన్నిహితంగా ఉన్న కేవీపీ.. ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు ఎందుకు దూరంగా ఉంటున్నారనే ప్రశ్నపై స్పందించారు.

congress leader kvp ramachandra rao response about maintain distance with ys jagan ksm
Author
First Published Apr 1, 2023, 1:45 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు సన్నిహితంగా ఉన్న కేవీపీ.. ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు ఎందుకు దూరంగా ఉంటున్నారనే ప్రశ్నపై స్పందించారు. అయితే ఇందుకు ఇప్పుడు సమాధానం చెప్పనని అన్నారు. అయితే ఈ ప్రశ్నల నుంచి తాను ఎంతో కాలం దూరం జరగలేనని.. ఏదో ఒక  రోజు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. మరో రోజు మీడియా  సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు. దీంతో కేవీపీ ఏం చెబుతారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇక, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కేవీపీని.. వైఎస్ ఆత్మగా కూడా పిలిచేవారనే సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. బీజేపీని వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతుందో తనకు కారణం తెలియదని చెప్పారు. ప్రత్యేక పరిస్థితులని చెబుతున్న తానే.. ఆ ప్రత్యేక పరిస్థితులు ఏమిటో తెలియదని చెబుతున్నానని అన్నారు. 2018లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని తాను వ్యతిరేకించానని.. కానీ ఈ విషయం బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నోరు విప్పలేదని అన్నారు. ప్రత్యేక హోదా అక్కర్లేదని ప్యాకేజ్‌కు ఒప్పుకుని చంద్రబాబు ఏపీకి మరణ శాసనం రాశారని విమర్శించారు. 

రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయం జరిగితే అంతా స్పందిస్తున్నారని.. కానీ ఏపీ నుంచి 25 మంది ఎంపీలు.. 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదని మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. తమ స్వార్ధప్రయోజనాల కోసం ప్రమాదకర పద్ధతులను కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందని విమర్శించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios