చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు బయపడ్డాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు బయపడ్డాయి. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా ఉన్న జిల్లాకే చెందిన విజయానందరెడ్డికి మధ్య కొంత గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది. వీరిద్దరు వేర్వురుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో.. కార్యకర్తలు కూడా వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం.. కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని ఇరువురు నేతలకు సూచించింది. అయినప్పటికీ పరిస్థితుల్లో ఏ మాత్రం కనిపించడం లేదని వైసీపీ వర్గాల్లోనే ప్రచారం సాగుతుంది.
తాజాగా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి విజయానందరెడ్డి హాజరుకాకపోవడంతో పార్టీలో వర్గవిభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. వైసీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ఆత్మీయ సమావేశం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సమావేశానికి వస్తూనే.. ఆర్టీసీ వైఎస్ చైర్మన్ విజయానందరెడ్డిని ఎందుకు పిలవలేదని ఎమ్మెల్యే శ్రీనివాసులును ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం మాటలకు ఎమ్మెల్యే శ్రీనివాసులు అదే రీతిలో అసహనం వ్యక్తం చేశారు. తాను విజయానందరెడ్డిని పిలిచానని.. ఉదయం ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్లిపోయారని చెప్పారు. సమావేశానికి ఆయన రాకపోతే దానికి తానేలా బాధ్యుడినని అసహనం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఇరువురి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ భరత్‌తో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు.. నారాయణస్వామికి నచ్చజెప్పడంతో ఆయన సమావేశానికి హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే శ్రీనివాసులు అధిష్టానం మాటలను పక్కనబెట్టారని నారాయణ స్వామి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
