ప్రమాదం జరిగిన విషయం తెలిసిన దగ్గర నుంచి అక్కడే ఉన్న చంద్రబాబు.. ప్రభుత్వం పరంగా త్వరగా స్పందించలేదు. కాగా.. తాజాగా హరికృష్ణ మృతికి ఏపీ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది.
సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ అకస్మిక మృతితో అభిమానులు, కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. దీంతో ఆయన తీవ్రగాయాలపాలై కామినేని హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఆయన మృతిపై ఏపీ ప్రభుత్వం కన్నా.. తెలంగాణ ప్రభుత్వం త్వరగా స్పందించింది. ఆయన మరణ వార్త తెలియగానే.. అధికార లాంఛనాలు ప్రభుత్వం తరపున నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన దగ్గర నుంచి అక్కడే ఉన్న చంద్రబాబు.. ప్రభుత్వం పరంగా త్వరగా స్పందించలేదు. కాగా.. తాజాగా హరికృష్ణ మృతికి ఏపీ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది.
