ఒంటరిగా నివాసముంటున్న సులోచన అనే మహిళ వద్దకు వచ్చి అబ్బద్ధాలు చెప్పి ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. అతడి మాటలు విన్న బాధితురాలు ఇంట్లో ఓ రూము అద్దెకిచ్చేందుకు సిద్ధపడింది. అయితే అతడి మనసులో మాత్రం దొంగతనం చేయాలన్న ఆలోచన ఉంది. 

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక.. ఓ వైస్ ప్రిన్సిపల్ దొంగగా మారాడు. ఒకప్పుడు విద్యార్థులకు మంచి, చెడులు వివరించిన ఆయన చెడు మార్గం వైపు అడుగులు వేశాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన పసుపులేటి రమేశ్‌బాబు కొద్దికాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీంతో అతడు నూజివీడు పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో ఒంటరిగా నివాసముంటున్న సులోచన అనే మహిళ వద్దకు వచ్చి అబ్బద్ధాలు చెప్పి ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. అతడి మాటలు విన్న బాధితురాలు ఇంట్లో ఓ రూము అద్దెకిచ్చేందుకు సిద్ధపడింది. అయితే అతడి మనసులో మాత్రం దొంగతనం చేయాలన్న ఆలోచన ఉంది. 

ఇల్లు చూసేందుకు లోనికి వెళ్లిన రమేశ్‌.. సులోచన ఒంటిపై బంగారు ఆభరణాలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని.. తొందరగా తీసి ఇస్తే వెళ్లిపోతానని బెదిరించాడు. అయితే తాను ఇవ్వనని బాధితురాలు ఎదురు తిరగడంతో ఆమె కాళ్లు చేతులు కట్టేసి ఆభరణాలు దోచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్‌ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. 24 గంటలు గడవక ముందే నిందితుడిని పట్టుకున్నారు. వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేసి ఆర్థిక ఇబ్బందులతో దొంగగా మారిన రమేశ్‌ కథనం నూజివీడులో సంచలనం సృష్టించింది.