అనంతపురం: ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న  యశ్వంత్ అనే విద్యార్ధిపై హాస్టల్ వార్డెన్ దాడికి దిగారు.  క్రమశిక్షణ పేరుతో దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నారు.హాస్టల్ లో ఉంటున్న సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ గొడవను లెక్చరర్లు ఆపారు. 

ఈ విషయమై హాస్టల్ వార్డెన్  క్రమశిక్షణ చర్యలు తీసుకొనే పేరుతో కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు అనంతపురం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ఈ దాడిని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

 జూనియర్లు,సీనియర్ల మధ్య ర్యాగింగ్ జరిగింది.ఈ విషయమై క్రమశిక్షణ పేరుతో హాస్టల్ వార్డెన్ కొట్టినట్టుగా సమాచారం. అయితే ర్యాగింగ్ జరిగిందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.