Asianet News TeluguAsianet News Telugu

coast guard: బోటులో మంటలు, కాకినాడలో 11 మంది మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డు సిబ్బంది

చేపల వేటకు  వెళ్తున్న 11 మంది మత్స్యకారులను  కోస్ట్ గార్డు సిబ్బంది  కాపాడారు. దీంతో ఆయా కుటుంబాల సభ్యులు  ఊపిరి పీల్చుకున్నారు. 

coast guard rescues 11 fishermen in kakinada district lns
Author
First Published Dec 1, 2023, 11:15 AM IST

కాకినాడ: చేపల వేటకు వెళ్తున్న బోటులో  అగ్ని ప్రమాదం జరగడంతో   11 మంది మత్స్యకారులను   కోస్ట్ గార్డు  సిబ్బంది  వారిని కాపాడారు. సముద్రంలో  బోటులో  చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారుల బోటులో  అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోటులోని గ్యాస్ సిలిండర్  పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని  ఇతర మత్స్యకారులతో పాటు కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  దీంతో  వెంటనే  కోస్ట్ గార్డు సిబ్బంది  కాకినాడ తీరంలో  గాలింపు చర్యలు చేపట్టారు.  కాకినాడ తీరంలో  ప్రమాదానికి గురైన బోటులోని  11 మంది మత్స్యకారులను రక్షించారు.  అగ్ని ప్రమాదం కారణంగా లైఫ్ జాకెట్ తో  సముద్రంలో దూకిన  వారితో పాటు  బోటులోనే ఉన్నవారిని కోస్ట్ గార్డు సిబ్బంది సురక్షితంగా కాపాడారు. 

సముద్రంలో చేపల వేటకు  కనీసం వారం రోజుల పాటు  మత్య్సకారులు వెళ్తారు.  వారం రోజుల పాటు తమకు అవసరమైన ఆహారం తీసుకెళ్తారు. కొన్ని సమయాల్లో  భోజనం వండుకొనేందుకు అవసరమైన సరుకులు, గ్యాస్ సిలిండర్ ను కూడ తీసుకెళ్తారు. బోటులోని   గ్యాస్ సిలిండర్  పేలుడుతో ప్రమాదం జరిగింది.   గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలడంతో బోటులో మంటలు వ్యాపించాయి. దీంతో  మత్స్యకారులు కోస్ట్ గార్డు సిబ్బందితో పాటు  ఇతర మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు. దీంతో కోస్ట్ గార్డు సిబ్బంది ప్రమాదానికి గురైన  11 మంది మత్స్యకారులను  రక్షించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios