వైద్య ఆరోగ్య రంగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో (CM camp office in Tadepalli) ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో క్యాన్సర్ బాధితులకు ఆరోగ్యశ్రీ (aarogyasri) ద్వారా చికిత్స అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సోమవారం సీఎం వైఎస్ జగన్ (ys jagan) తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో (CM camp office in Tadepalli) ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షకలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌తో పాటుగా సంబంధిత శాఖలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీల్లో సూపర్‌ స్పెషాల్టీ సేవలు అందుతాయని చెప్పారు. ఇవి కాకుండా క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా మూడు సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటవుతాయని తెలిపారు. వీటితో పాటు గతంలోనే ప్రకటించిన విధంగా చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆస్పత్రులను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.

క్యాన్సర్ చికిత్స కోసం ఏర్పాటు చేసే మూడు సూపర్ స్పెషాల్టి ఆస్పతుల్లో కాన్సర్ బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించనున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు. ఏపీలో క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీల ఆస్పత్రులు లేకపోవడం వల్ల ప్రజలు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలి వెళ్లాల్సి వస్తోందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. క్యాన్సర్‌ రోగులకు aarogyasri ద్వారా పూర్తిస్థాయిలో చికిత్సలు, ఇతర సేవలు అందాలని స్పష్టం చేశారు.

Also read: AP PRC: ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్... సాయంత్రమే ఉద్యోగసంఘాల చేతికి పీఆర్సీ నివేదిక (Video)

ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని సేవలందించేందుకు వీలుగా విశాఖపట్నం కేజీహెచ్‌లో కొత్త ఎంఆర్‌ఐ, కాకినాడ జీజీహెచ్‌లో ఎంఆర్‌ఐ, క్యాథ్‌ల్యాబ్, కర్నూలులో క్యాథ్‌ల్యాబ్, పాడేరు, అరకు ఆస్పత్రుల్లో అనస్థీషియా, ఆప్తాలమిక్, ఈఎన్‌టీ సేవలకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీటిని సమకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం రూ. 37.03 కోట్లను వెచ్చించనుంది. మరోవైపు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య సేవల పొందాలంటే ఎక్కడికి వెళ్లాలో సూచించేలా సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఇందుకు విలేజ్ క్లినిక్స్ రిఫరల్ పాయింట్ కావాలని స్పష్టం చేశారు. విలేజ్‌ క్లినిక్స్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకూ గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంలు ఈ బాధ్యత తీసుకోవాలని సూచించారు. 

ఆరోగ్యశ్రీ సేవలు సమర్థంగా అందించేందుకు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. ఇందులో సందేహాల నివృత్తి ఏర్పాట్లు కూడా ఉండాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆరోగ్య మిత్రలకు సెల్‌ఫోన్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.