తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి,జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన అధికారిక ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ను తారక్ అని ఆప్యాయంగా సంబోధిస్తూ విషెస్ తెలిపారు ఏపీ సీఎం.

''ప్రియమైన తారక్ కు పుట్టినరోజు శుభాంకాంక్షులు. ఆ దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని మరియు అమితమైన ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను'' అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్ ''థ్యాంక్యూ అన్నా'' అంటూ రిప్లై ఇచ్చారు. 

Scroll to load tweet…

జనసేన అధ్యక్షులు, టాలీవుడ్ సినీ హీరో పవన్ కల్యాణ్ కూడా కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ''ప్రియమైన సోదరుడు కేటీఆర్ కు నా హృదరపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ చిల్కూరు బాలాజి మీకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ శుభదినాన నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా'' అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు కూడా ''థ్యాంక్యూ అన్నా'' అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. 

Scroll to load tweet…