అమరావతి: బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సీఎం రమేష్ బీజేపీలో చేరడంపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. 

గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కాళ్ళు మెుక్కి ఆశీస్సులు తీసుకోవడంపై చేసిన రచ్చను గుర్తుకు తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోదీ అన్యాయం చేశారంటూ రాజ్యసభ, లోక్ సభలలో టీడీపీ సభ్యులు ఆందోళనలు చేస్తుంటే విజయసాయిరెడ్డి మాత్రం మెకాళ్లకు మెుక్కతారా అంటూ విమర్శించారు.

12 కేసుల్లో ముద్దాయి అయిన విజయసాయిరెడ్డి ఆ కేసులను తప్పించుకునేందుకు మోకరిల్లారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను గుర్తు చేస్తూ సీఎం రమేష్ ఇప్పుడు ఎవరు మోకరిల్లారంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.