సారాంశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో ఈ శాంతి యజ్ఞం నిర్వహించారు.
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో ఈ శాంతి యజ్ఞం నిర్వహించారు. ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మహా యజ్ఞంలో సీఎం జగన్ పాల్గొన్నారు.
అయితే మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. వేదపండితులు నిర్వహించిన ఈ శాంతి యజ్ఞంలో సీఎం జగన్‌తో పాటు దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రికి మంత్రి కొట్టు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.