ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను (Akshaya Patra centralized kitchen) సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను (Akshaya Patra centralized kitchen) సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. స్కూళ్లలో జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజనం) అవసరమైన ఆహారం ఇక్కడే తయారు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మధ్యాహ్న భోజనం ఇక్కడినుంచే సరఫరా అవుతుంది. ఇందుకుగానూ, అక్షయపాత్ర ఫౌండేషన్‌ అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేసింది. కేవలం రెండు గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్దం చేసేలా దీన్ని నిర్మించారు. విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న భోజనవివరాలను..ఫౌండేషన్‌ ప్రతినిధులు సీఎంకు వివరించారు

ఇదిలా ఉంటే.. తాడేపల్లి మండలం కొలనుకొండలో ఇస్కాన్ రూ. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హరేకృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేశారు. ఇక్కడ రాధాకృష్ణులు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు, కల్చరల్ ఎక్స్‌పో, సంకస్కార హాల్ నిర్మించనున్నారు. అలాగే యోగ ధ్యాన కేంద్రాలు, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. 

గుంటూరు జిల్లాలో జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజనం) కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు అక్షయపాత్ర ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు Bharatarshabha Dasa తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా చేస్తున్నట్టుగానే భారత ప్రభుత్వం నిర్దేశించిన పౌష్టికాహార నిబంధనల ప్రకారం పిల్లలకు ఆరోగ్యకరమైన, తాజా, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించడం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. అయితే అక్షయపాత్ర మధ్యాహ్న భోజనం అందించే పాఠశాలల్లో గుడ్లు అందించడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది అని Bharatarshabha Dasa చెప్పారు.

అక్షయపాత్ర ఫౌండేషన్ గురించి.. 
అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది ఇస్కాన్ యొక్క నాన్ ఫ్రాఫిట్ విభాగం. ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ-సహాయక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల ఆకలిని తొలగించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. 2000వ సంవత్సరంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏర్పాటు అయింది. పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడం, సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన పిల్లల విద్యా హక్కుకు మద్దతు ఇవ్వడాన్ని కూడా ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రారంభమైన రోజు నుంచి అక్షయపాత్ర పాఠశాల విద్యార్థులకు తాజా, పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రయత్నాలన్నింటినీ నిర్వహిస్తోంది. సాంకేతికను వినియోగించి పరిధిని పెంచుకోవడంతో పాటుగా, వీలైనంతా మంది ఎక్కువ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించేలా నిరంతరం కృషి చేస్తోంది. అదే సమయంలో భారత ప్రభుత్వం నిర్దేశించిన పౌష్టికాహార నిబంధనల ప్రకారం పిల్లలకు ఆరోగ్యకరమైన, తాజా, పౌష్టికాహారాన్ని అందిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట ప్రభుత్వాలతో భాగస్వామ్యం కుదుర్చుకుని విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందజేస్తుంది. ఇందుకోసం సంస్థకు కార్పోరేట్‌లు, వ్యక్తిగత దాతలు, శ్రేయోభిలాషుల మద్దతుగా నిలుస్తున్నారు. 2000లో 5 పాఠశాలల్లో కేవలం 1,500 మంది పిల్లలకు అక్షయ పాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజనం అందించగా.. ఇప్పుడు 1.8 మిలియన్ల పిల్లలకు సేవ చేసే స్థాయికి ఎదిగింది.