Asianet News TeluguAsianet News Telugu

ధర్నా చేస్తానన్న వైసీపీ ఎమ్మెల్యే, నేనెళ్లిపోతానన్న తహశీల్దార్: వామ్మో ఎవరూ తగ్గలేదుగా...

అదే వేదికపై రైతుల ఆర్ఎస్ఆర్ రికార్డుల వివరాలు చెప్పాలంటూ తహసీల్దార్‌ బాలకృష్ణను నిలదీశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు తహశీల్దార్ బాలకృష్ణ. ఎమ్మెల్యే ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు. తాను కొత్తగా వచ్చానని చెప్పుకొచ్చారు. లంచాలు ఇచ్చి తహశీల్దార్‌గా రాలేదు. తాను పదిసార్లు ఉత్తమ అవార్డు తీసుకున్నా. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్లిపోతా అంటూ ఎమ్మెల్యేకు బాలకృష్ణ సమాధానం ఇవ్వడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

clashes between ysrcp mla brahmanaidu mro balakrishna in guntur
Author
Guntur, First Published Aug 2, 2019, 8:41 PM IST

గుంటూరు: గుంటూరు జిల్లా బొల్లాపల్లి బహిరంగ సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బొల్లాపల్లి మండలంలో సభ నిర్వహించారు. ఆ సభకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. 

 రైతుల సర్వే నెంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంపై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులపై చిర్రుబుర్రులాడారు. రైతులకు న్యాయం చేయలేని పదవులు, ఉద్యోగాలు అనవసరం అంటూ వ్యాఖ్యానించారు. 

ఎమ్మెల్యే పదవి అంటే తనకు మోజు కాదన్నారు. ప్రజాసేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. అంతేకాదు అధికారులు పనిచేయకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు.  

అదే వేదికపై రైతుల ఆర్ఎస్ఆర్ రికార్డుల వివరాలు చెప్పాలంటూ తహసీల్దార్‌ బాలకృష్ణను నిలదీశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు తహశీల్దార్ బాలకృష్ణ. ఎమ్మెల్యే ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు. 

తాను కొత్తగా వచ్చానని చెప్పుకొచ్చారు. లంచాలు ఇచ్చి తహశీల్దార్‌గా రాలేదు. తాను పదిసార్లు ఉత్తమ అవార్డు తీసుకున్నా. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్లిపోతా అంటూ ఎమ్మెల్యేకు బాలకృష్ణ సమాధానం ఇవ్వడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అటు ఎమ్మెల్యే ఇటు ఎమ్మార్వో ఎవరికి వారు తగ్గకపోవడంతో సభలో ప్రజలంతా ఒక్కసారిగా స్తబ్ధుగా ఉండిపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios