ప్రకాశం జిల్లా దర్శి వైసీపీలో ఫ్లెక్సీల వివాదం కలకలం రేపుతోంది. సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా బూచేపల్లి, మద్దిశెట్టి వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బూచేపల్లి వర్గీయుల ఫ్లెక్సీలను పంచాయతీ అధికారులు తొలగించారు.

నిరసనగా పంచాయతీ ఆఫీస్‌ ఎదుట బూచేపల్లీ వర్గీయుల ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మద్దిశెట్టికి అనుకూలంగా అధికారుల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాజా ఘటనతో దర్శిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.