తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాల‌పై సినీ నటుడు మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు.

బుధవారంనాడు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశాన్ని పాలించేందుకు సరైన అర్హత ఉన్నవాళ్లు మోడీ, అమిత్‌షాలేనని ఆయన చెప్పారు.  ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని తన జీవితంలో చూడలేదన్నారు. దేశానికి అమిత్ షా లాంటి వాళ్ల నాయకత్వం అవసరమని ఆయన చెప్పారు.

Also read:మోడీతో మోహన్ బాబు భేటీ: రాజకీయాల కోసం కాదు.. మరెందుకంటే.

ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను సినీ నటుడు మోహన్ బాబు కుటుంబసభ్యులు కలిశారు. మోడీని కలిసిన మోహన్ బాబు కుటుంబసభ్యులు 15 నిమిషాల పాటు చర్చించారు. 

బీజేపీలో చేరాలని మోహన్ బాబు కుటుంబసభ్యులను ప్రధానమంత్రి మోడీ కోరారు. అదే రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ను కూడ మోహన్ బాబును కలిశారు. ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.