Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు వ్యాఖ్యలు: టీడీపీకి క్రిస్టియన్ సెల్ సభ్యుల రాజీనామా

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ టీడీపీ క్రిస్టియన్ సెల్ సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ తెలియజేశారు. 

christian cell members quit from telugu desam party ksp
Author
Amaravathi, First Published Jan 12, 2021, 4:08 PM IST

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ టీడీపీ క్రిస్టియన్ సెల్ సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ తెలియజేశారు.

టీడీపీలో ఎంతోకాలంగా ఉండి పార్టీ కోసం పనిచేస్తున్నామని వారు వెల్లడించారు. చంద్రబాబు 5వ తేదీన చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

క్రైస్తవ సమాజాన్ని అవమానించే విధంగా మాట్లాడారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడూ ఇలాంటి మాటలు గతంలో‌ చేయలేదని.. ఆ మాటలతో క్రైస్తవులు మనోభావాలు దెబ్బ తిన్నాయని ప్రవీణ్ స్పష్టం చేశారు.

గతంలో చంద్రబాబు అనేక సార్లు చర్చిలో మీరు‌ ప్రార్ధనలు కూడా చేశారని.. మసీదులకు‌ వెళ్లి నమాజ్‌ చేసి శుభాకాంక్షలు చెప్పలేదా అని ఆయన నిలదీశారు. లౌకిక దేశంలో అన్ని మతాల వారు, అన్ని పండుగలలో పాల్గొంటారని ప్రవీణ్ గుర్తుచేశారు.

చర్చి ఫాదర్ లకు ఐదు‌వేల రూపాయలు ఇస్తే... తప్పు పట్టడం దేనికన్న ఆయన మీ మ్యానిఫెస్టోలో  కూడా అనేక పధకాలు పెట్టలేదా అని ప్రశ్నించారు. మత మార్పిడి విషయంలో కూడా క్రిస్టియన్ లను అవమానించారని.. బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నట్లు నిరూపించాలని ప్రవీణ్ సవాల్ విసిరారు.

గ్రామాలలో చర్చిలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పడం సరికాదని హితవు పలికారు. గతంలో క్రైస్తవుల కు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రవీణ్ ప్రశ్నించారు.

తాము మీ అభివృద్ధి కోసం పని‌చేస్తే... తమను ఇలా బాధ పెట్టడం సరి కాదన్నారు. పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లినా .. స్పందించ లేదని, అందుకే మీడియా సమావేశం ద్వారా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నామని ప్రవీణ్ చెప్పారు.

క్రైస్తవులు పై ఇలాంటి  వ్యాఖ్యలు ఎందుకు‌ చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. టీడీపీ క్రిస్టియన్ సెల్ ప్రతినిధులు అంతా పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రవీణ్ ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios