Asianet News TeluguAsianet News Telugu

చిన్నారి దర్శిత్ దక్కలేడు.. ఇలాంటి ప్రమాదాలకు సీఎం బాధ్యత వహించాలి: చంద్రబాబు

చిన్నారి దర్శిత్ మరణం రాష్ట్రాన్ని కలవర పెడుతున్నది. ఆయన కోసం రాష్ట్ర ప్రజలంతా చేసిన ప్రార్థనలు నిరర్ధకంగా మిగిలిపోయాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలకు సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
 

chinnari darshit died after electrocution, condoles chandrababu naidu
Author
First Published Nov 26, 2022, 7:43 PM IST

అమరావతి: చిన్నారి దర్శిత్ మరణం రాష్ట్రాన్ని కదిలిస్తున్నది. మృత్యువుతో పోరాడుతూ హాస్పిటల్‌లో మరణించింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత పాలన వల్ల మూడేళ్ల చిన్నారి దర్శిత్‌కు అప్పుడే నూరేళ్లు నిండాయని వివరించారు.

చిన్నారి దర్శిత్ కోసం తల్లిదండ్రులు ఎంతో తపించారని అన్నారు. వారితోపాటు రాష్ట్ర ప్రజలంతా చేసిన ప్రార్థనలు నిష్ఫలంగా మిగిలిపోయాయని బాధ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుస విద్యుత్ ప్రమాదాలతో ప్రాణాలు పోతున్నా పాలకులు మాత్రం అధికారమత్తు వదలటం లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉజ్వల భవిష్యత్ ఉన్న మూడేళ్ల పసివాడు అర్ధాంతరంగా కన్నుమూశాడని వివరించారు.

Also Read: నీ గురువు మళ్లీ అధికారంలోకి రాడు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు : పవన్‌పై కొడాలి నాని సెటైర్లు

ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దర్శిత్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలని, వారికి నష్ట పరిహారం అందించాలని అన్నారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. అంతేకాదు, ఇక నుంచి ఇలాంటి ప్రమాదాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios