Asianet News TeluguAsianet News Telugu

కరోనాఎఫెక్ట్: విశాఖ షిప్‌యార్డ్‌కు చైనా నౌకకు నో ఎంట్రీ

విశాఖపట్టణం షిప్‌యార్డుకు చైనా నౌక వచ్చింది. చైనా నుండి ఈ నౌక రావడంతో  అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నౌక విశాఖ షిప్‌ యార్డులో సరుకులను దించుకొనేందుకు  నెల రోజుల క్రితమే అనుమతి తీసుకొన్నారు.

China's Fortune Hero ship stopped fromr entering Visakhapatnam coast
Author
Amaravathi, First Published Mar 6, 2020, 1:59 PM IST

విశాఖపట్టణం:విశాఖపట్టణం షిప్‌యార్డుకు చైనా నౌక వచ్చింది. చైనా నుండి ఈ నౌక రావడంతో  అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నౌక విశాఖ షిప్‌ యార్డులో సరుకులను దించుకొనేందుకు  నెల రోజుల క్రితమే అనుమతి తీసుకొన్నారు. కరోనా భయంతో ఈ నౌక చైనా నుండి రావడంతో ఇందులో ఉన్న వారిని పరీక్షించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.

చైనా నుండి  ఫార్చూన్ నౌక  విశాఖపట్టణానికి గురువారం నాడు సాయంత్రం చేరుకొంది. చైనా నుండి  సరుకులను తీసుకొని ఈ నౌక విశాఖపట్టణానికి చేరుకొంది. ఈ నౌకలో 22 మంది ఉన్నారు. వీరిలో 17 మంది చైనీయులు ఉన్నారు. మిగిలిన ఐదుగురు మయన్మార్‌కు చెందినవారు ఉన్నారు.

చైనాలో‌  కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో చైనా నుండి ఈ నౌక రావడంతో ఈ నౌకలో ఉన్నవారికి పరీక్షలు నిర్వహించిన తర్వాతే  షిప్‌యార్డు
అనుమతించాలని  అధికారులు నిర్ణయించారు.

షిప్‌ను అవుటర్ హర్బర్‌లోనే ఉంచారు. ఈ నౌకలో ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే  కార్గో హ్యండిలింగ్‌కు అనుమతి ఇస్తారు. గత నెల 27న  నౌక  చైనా నుండి సింగపూర్‌కు వెళ్లింది. అక్కడి నుండి నౌక తిరిగి విశాఖపట్టణానికి చేరుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios